telugu navyamedia
సినిమా వార్తలు

దొరసాని : కప్పతల్లి కప్పతల్లి లిరికల్ వీడియో

Dorasaani

కొత్త దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా “దొరసాని” సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. జూలై 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దొరల కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తక్కువ జాతిలో పుట్టిన ఓ కుర్రాడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి “కప్పతల్లి కప్పతల్లి…” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలాపించగా… గోరెటి వెంకన్న లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts