telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

డబల్ సెంచరీ తో .. దక్షిణాఫ్రికాను బెదరగొట్టిన కోహ్లీ..

kohli double century on south africa in

ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పూణే వేదిక జరుగుతున్న రెండో టెస్టులో రెండవరోజు చిన్నపాటి విధ్వసంమే సృష్టించాడు. ఓవర్ నైట్ స్కోర్ 63 పరుగుల వ్యక్తి గత స్కోర్ తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన కోహ్లీ… ద్విశతకం తో చెలరేగాడు. ఫలితంగా టెస్టుల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఈమ్యాచ్ లో కోహ్లీ 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెస్టుల్లో అతనికిదే అత్యత్తమ స్కోర్. అలాగే టెస్టుల్లో 7సార్లు డబుల్ సెంచరీ లు సాధించిన మొదటి భారత బ్యాట్స్ మెన్ కూడా కోహ్లీ నే కావడం విశేషం. ఇంతకుముందు మాజీ భారత క్రికెటర్లు సచిన్ , సెహ్వాగ్ లు ఆరుసార్లు డబుల్ సెంచరీలు చేశారు. ఇక వన్డేలు , టెస్టుల్లో కలిపి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సెంచరీల సంఖ్య 40. దాంతో కెప్టెన్ గా అత్యధిక సెంచరీ లు సాధించిన భారత ఆటగాడి గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

అలాగే అన్ని ఫార్మాట్ లలో కలిపి కోహ్లీ 21000 పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లోనే కోహ్లీ ఫీట్ ను చేరుకొని చరిత్ర సృష్టించాడు. భారత్ తరుపున టెస్టుల్లో 7000 పరుగులు పూర్తి చేసిన 7వ బ్యాట్స్ మెన్ గా కోహ్లీ ఘనత సాధించాడు. అలాగే టెస్టుల్లో వేగంగా 26 శతకాలను పూర్తి చేసిన నాల్గో బ్యాట్స్ మెన్ గా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ 138 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలు రాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు బ్రాడ్ మాన్ 69 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఫీట్ ను సాధించి గా స్టీవెన్ స్మిత్ 120 ఇన్నింగ్స్ ల్లో , సచిన్ 136 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించారు. మొత్తానికి ఈ తాజా ద్విశకతం తో కెరీర్ లో 50 వ టెస్ట్ ను మరుపురాని టెస్ట్ గా మలుచుకున్నాడు కోహ్లీ.

Related posts