telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మరో బాలీవుడ్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్…

కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటుగా సినీ రంగం కూడా చాలా నష్టపోయింది. ఆయితే లాక్ డౌన్ అనంతరం మొదలైన సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. అయితే… చిత్రంగా కొవిడ్ 19కు వాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టలేదు సరికదా… రోజు రోజుకూ పెరుగుతూ ఉన్నాయి. తాజాగా కరోనా మరోసారి బాలీవుడ్ నటీనటులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే కరోనా టెస్ట్ లో పాజిటివ్ రిజల్డ్ వచ్చిన రణబీర్ కపూర్ హోమ్ క్వారంటైన్ లో గడుపుతుంటే… లేటెస్ట్ గా యంగ్ హీరోయిన్ తారా సుతారియాకు, నటుడు సిద్ధాంత్ చతుర్వేదికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. తారా ‘తపడ్’ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉండగా, సిద్ధాంత్ ‘ఫోన్ బూత్’ షూటింగ్ లో ఇషాన్ కట్టర్, కత్రినాకైఫ్ తో కలిసి నటించాల్సి ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఆ కార్యక్రమాలను రద్దు చేసుకుని హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు సమాచారం. తారా సుతారియా కరోనా బారిన పడిన విషయాన్ని స్వయంగా తెలియచేయకపోయినా… ఆమె సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. అయితే చూడాలి మరి ఈవిడ దీని నుండి ఎప్పటికి బయటపడుతుంది అనేది.

Related posts