telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవెంజర్స్ .. బంపర్ హిట్.. మరి వాళ్ళ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా..

Avengers-4

అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రంలోని ఎమోషనల్ కంటెంట్, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు సినిమాను విజయపథం వైపు నడిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఐరన్ మ్యాన్‌గా కీలక పాత్రను పోషించిన రాబర్ట్ డౌనీ జూనియర్ నటనను ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతటి ప్రభావాన్ని చూపిన హీరో రాబర్ట్ రెమ్యునరేషన్ వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.

అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం రిలీజైన తర్వాత అందరి నోటా రాబర్ట్ డౌనీ జూనియర్ గురించే వినిపించింది. గతంలో కామిక్ క్యారెక్టర్ యాక్టర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ హీరో అవెంజర్స్: ఎండ్ గేమ్ తర్వాత ప్రేక్షకుడు గుండెలు పగిలే విధంగా భావోద్వేగాన్ని పండించారు. ఈ సూపర్ హీరోగా అవెంజర్స్ కోసం భారీగానే రెమ్యునరేషన్ రాబట్టినట్టు సమాచారం.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్‌లో చివరిదైన అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ కోసం రాబర్ట్ డౌనీకి దాదాపు 75 మిలియన్ల డాలర్లను చెల్లించారు. అంటే అక్షరాల రూ.524 కోట్లు అన్నమాట. అంతేకాకుండా గతంలో విడుదలైన అవెంజర్ సిరీస్‌ల ద్వారా కూడా ప్రతిఫలాన్ని పొందే హక్కులను సొంతం చేసుకొన్నారట.

ప్రతీ రోజు 5 మిలియన్ డాలర్లను రెమ్యూనరేషన్‌గా అందుకొంటూ, స్పైడర్ మ్యాన్ హోం కమింగ్ సినిమాకు పనిచేసే సమయంలో వారానికి మూడు రోజులపాటు పనిచేశారట. . ఐరన్ మ్యాన్ సక్సెస్ తర్వాత ప్రతీ సినిమాకు 20 మిలియన్ డాలర్ల రెమ్యునరేషన్ అందుకొనే అతికొద్ది మంది హాలీవుడ్ హీరోలలో ఒకడిగా మారారు.

క్రిస్ హేమ్స్‌వర్త్, క్రిస్ ఇవాన్స్ మిగితా వారెవరూ రాబర్ట్ డౌనీకి దారిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఈ చిత్రంలో నటించిన స్కార్లెట్ జాన్సన్ మాత్రం ఇన్ఫినిటీ వార్‌ కోసం సుమారు 20 మిలియన్ డాలర్లు అంటే రూ.139 కోట్ల రెమ్యునరేషన్ అందుకొన్నారు.

అవెంజర్స్: ఎండ్‌గేమ్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తున్నది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.8 వేల కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రపంచంలో విడుదలైన ప్రతీచోట.. దాదాపు 46 దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఇండియాలో ఈ చిత్రం రూ.200 కోట్లు వసూలు చేసి భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్నది.

Related posts