బంగ్లాదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆ దేశంలో ఉన్న అతిపెద్ద రోహింగ్యాల క్యాంప్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా.. 400 మంది జాడ తెలియడం లేదు. సుమారు 50 వేల మంది తమ తాత్కాలిక నివాసాలను కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే.. ఈ శిబిరాల్లో అధిక శాతం షెల్టర్లు వెదురుతో నిర్మించినవి కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నాలుగు ఆస్పత్రులు, ఆరు హెల్త్ సెంటర్లు దగ్ధమయ్యాయి. ఇంకా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బర్మా నుంచి రోహింగ్యాల వలసలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద ప్రమాదమని బంగ్లాదేశ్ అధికారులు పేర్కొన్నారు. ఈ క్యాంప్‌లో సుమారు పది లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు. వీళ్లంతా 2017లో మయన్మార్ ఆర్మీ దాడి తర్వాత ఆ దేశాన్ని వదిలి వేరే దేశాలకు వలస వెళ్లిన వాళ్లే కావడం గమనార్హం.