telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గెలిస్తే టిక్ టాక్ .. దేశం కోసం ఉపయోగిస్తా.. : సోనాలి ఫొగాట్‌

sonali pogaut on tiktok usage in

బీజేపీ టీవీ నటి, టిక్‌టాక్‌ స్టార్‌ సెలబ్రిటీ అయిన సోనాలి ఫొగాట్‌కు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించిన సంగతి తెలిసిందే. హరియాణాలో జాట్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఆదంపూర్‌ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోనాలి ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఇకపై టిక్‌టాక్‌ వేదికగా దేశ భక్తిని పెంపొందించే వీడియోలను చేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ వినోదభరితమైన వీడియోలు మాత్రమే రూపొందించానని, ఇక నుంచి తన నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన పనుల వీడియోలను కూడా టిక్‌టాక్‌లో పంచుకుంటానని అన్నారు. మహిళల భద్రత, దేశ భక్తి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తానని చెప్పారు.

టిక్‌టాక్‌ మాధ్యమం కొన్ని సినిమాలు, సీరియళ్లలో చిన్న పాత్రల్లో కనిపించే తనకు.. గుర్తింపు వచ్చేందుకు ఎంతో ఉపయోగపడిందని ఆమె చెప్పారు. రాజకీయ పరంగా తనను ప్రభావితం చేసిన వారిలో సుమిత్రా మహాజన్‌ ముందు వరుసలో ఉంటారని దివంగత నేత సుష్మా స్వరాజ్‌ ప్రభావమూ తనపై ఉందని అన్నారు.

Related posts