telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..ఏప్రిల్ 1 నుంచే అమలు

traffic hyderabad

దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎన్ని రూల్స్‌ పెట్టినప్పటికీ… రోడ్డు ప్రమాదాలు తగ్గటం లేదు. పరిమితి మించి వేగంగా వెళ్లడం కారణంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనంలోని ముందు సీట్లలో ఎయిర్‌ బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి తయారయ్యే వాహనాలు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. వినియోగంలో ఉన్న వాహనాల్లో ఆగస్టు 31 నాటికి ఎయిర్‌ బ్యాగ్‌లను అమర్చుకోవాలని పేర్కొంది. రహదారి భద్రతకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం. కాగా దేశంలో ప్రయాణికుల భద్రతా విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని, రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఇటీవల అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

Related posts