విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమా ఘటనపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, సుచరిత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ప్రమాదంపై వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు.
స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సాహసకృత్యాలు దేశాన్ని ముందుకు నడిపించలేవు: ప్రణబ్ ముఖర్జీ