telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ తో ప్రమాదమే అంటున్న.. అమెరికా ..

trump intermediate on india and pakistan

అమెరికా ఆర్టికల్ 370 రద్దును పాకిస్థాన్ ప్రభుత్వంతో పాటు ఉగ్రవాదులూ వ్యతిరేకిస్తున్నారని తెలిపింది. భారత్‌లో పాక్ ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్రలు పన్నారని అనుమానాలు వ్యక్తం చేసింది. ఉగ్ర సంస్థలను పాక్ కట్టడి చేయకపోతే ఖచ్చితంగా దాడులకు తెగబడతారని స్పష్టం చేసింది. ఈ విషయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతుగా నిలుస్తుందని తాము అనుకోవడం లేదని అమెరికా రక్షణ శాఖ ఇండో-పసిఫిక్ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ శ్రీవర్ వ్యాఖ్యానించారు. చైనా మద్దతు కేవలం రాజకీయ, దౌత్యపరమైనవిగానే తాము భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్‌తో చర్చలు జరిపామని ఆయన తెలిపారు. చైనాతో భారత్ సత్ససంబంధాలనే కోరుకుంటోందని అన్నారు. అయితే ఇరు దేశాల మధ్య కొంత పోటీతత్వం, ఆందోళనలు కూడా ఉన్నాయని చెప్పారు.

ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు షాకిస్తూ.. జమ్మూకాశ్మీర్ విషయంలో భారత వైఖరిని సౌదీ అరేబియా సమర్థించింది. సౌదీ యువరాజ్ మహ్మద్ బిన్ సల్మాన్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బుధవారం సమావేశమై జమ్మూకాశ్మీర్ పరిణామాలను వివరించారు. దాదాపు రెండుగంటలపాటు సాగిన ఈ భేటీలో జమ్మూకాశ్మీర్‌కు సంబంధించి భారత్ ఇటీవల తీసుకున్న చర్యలు, అక్కడి పరిణామాలపై అజిత్ ధోవల్ సౌదీ యువరాజుకు వివరించారు. జమ్మూకాశ్మీర్‌పై పాక్ చేస్తున్న దుష్ప్రచారాన్ని సౌదీ రాజు ముందు ఎండగట్టారు ధోవల్. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ విషయంలో భారత్ చేపట్టిన చర్యలపై సౌదీ యువరాజు సంతృప్తి వ్యక్తం చేస్తూ సానుకూలంగా స్పందించారు. జమ్మూకాశ్మీర్ విషయంలో భారత్‌కు మద్దతుగా ఉంటామని చెప్పారు. తమకు మద్దతుగా నిలుస్తుందని అనుకున్న పాక్‌కి.. సౌదీ రాజు వ్యాఖ్యలు గట్టి షాకే ఇచ్చాయి.

Related posts