telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పట్టా కోసం రూ.1.10 కోట్ల లంచం..ఏసీబీ చిక్కిన తహసీల్దార్

Acb tahasildar

కీసర మండలం రాంపల్లి విలేజ్ లో 53 ఎకరాల వివాదాస్పద భూమిని పట్టా చేసేందుకు రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటూ కీసర తహసిల్దార్ నాగరాజు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ తహసీల్దార్ ఈ స్థాయిలో లంచం తీసుకుని పట్టుబడడం ఏసీబీ చరిత్రలో ఇదే తొలిసారి. బాధితులు ఫిర్యాదు చేయకుండా నేరుగా ఏసీబీ అధికారులే తహసీల్దార్‌ను పట్టుకోవడం విశేషం. ఈ కేసులో ఓ ప్రముఖ నేత అనుచరుడు, మరో మధ్యవర్తి, వీఆర్ఏను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ…దర్యాప్తులో భూమికి సంబంధించిన వివరాలు అన్ని బయటకు వస్తాయన్నారు. తమకు సమాచారం అందడంతో సుమోటోగా కేసు నమోదు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. రైతులకి ఫెవర్ గా చేస్తామని ల్యాండ్ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలగజేసుకుని తాసిల్దార్ కు లంచం ఇచ్చారని అన్నారు. అల్వాల్ లోని తహసిల్దార్ నాగరాజు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నామని తెలిపారు.

Related posts