telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కార్ దొంగిలించడానికి వచ్చిన దొంగ… యజమాని ఏం చేశాడో చూడండి

Thief

అర్థరాత్రి 2 గంటలకు ఇంటి ముందు పార్క్ చేసిన ఆడీ కార్‌ను దొంగిలించడానికి ప్రయత్నించిన దొంగకు ఆ కారు యజమాని షాక్ ఇచ్చాడు. లండన్‌లోని సిడెనాం ప్రాంతానికి చెందిన స్మిత్ బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి ముందు ఉన్న కెమెరాకు అలార్మ్ సెట్ చేసుకోవడం ద్వారా తలుపు వద్దకు ఎవరైనా వస్తే స్మిత్‌ ఫోన్‌కు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. శనివారం అర్థరాత్రి నైట్‌క్లబ్‌కు వెళ్లిన స్మిత్‌ ఫోన్‌కు అలానే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి కెమెరాను పరిశీలించగా.. ఓ దొంగ ల్యాప్‌టాప్ టాబ్లెట్‌ను స్క్రోలింగ్ చేయడం కనిపించింది. దొంగ ఏం చేస్తున్నాడో స్మిత్‌కు అర్థం కాక వెంటనే ఇంటి ముందు అమర్చిన అలార్మ్ ద్వారా ‘హాయ్, నేను హెల్ప్ చేయనా’ అంటూ మాట్లాడాడు. అంతే ఆ వాయిస్ విన్న దొంగ దెబ్బకు అక్కడ నుంచి జారుకున్నాడు. బహుశా రూ.35 లక్షలు విలువచేసే తన ఆడీ కారును దొంగిలించడానికే వచ్చుంటాడని స్మిత్ అనుమానం వ్యక్తం చేశాడు. రోజురోజుకూ మరింత అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ ద్వారా ఇంట్లో లేకుండానే దొంగలను కనిపెట్టే అవకాశం లభిస్తోంది.

Related posts