విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితులను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.
వైద్య సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని అడిగారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. జగన్ వెంట డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ఉన్నారు.