telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ మళ్ళీ ఆమేనా..?

మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమాలో హీరరోయిన్ ఎవరనేది తేలడంలేదు. ఈ విషయంపై క్లారిటీ కోసం అభిమానుల జుట్టుపీక్కుంటున్నారు. ఇటీవల త్రివిక్రమ్, ఎన్‌టీఆర్ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందాన చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులు తమ ప్రశ్నకు సమాధానం వచ్చిందని కాస్త కుదుటబడ్డారు. కానీ నిన్న జరిగిన అలావైంకుఠపురములో రీయూనియన్‌లో పూజా చేసిన వ్యాఖ్యలు మళ్లీ అభిమానుల ఆలోచనలకు చెక్ పెట్టాయి. పూజ త్రివిక్రమ్ దర్వకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు తెలిపింది. దాంతో ఎన్‌టీఆర్ తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుందా అని వార్తలు వినిపిత్తున్నాయి. వీరు ముగ్గురి కాంబో ఇదివరకు వచ్చి అరవింద సమేతా బ్లాక్ బస్టర్ అయింది. దాంతో మళ్లీ ఈ కాంబో రిపీట్ అయితే దాని రేంజ్ వేరే లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్‌పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దాంతో అభిమానుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో త్రివిక్రమ్ సినిమాలో ఎన్‌టీఆర్ సరసన ఎవరు చేయనున్నారన్నది తేలాల్సి ఉంది. దాని కోసం ఎన్‌టాఆర్ ఫాన్య్ ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది.

Related posts