telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఓ వ్యక్తి ప్రాణం తీసిన గూగుల్‌ మ్యాప్స్…

ఎక్కడికైనా వెళ్లాలంటే గూగుల్‌ మ్యాప్‌ ఓపెన్ చేసి.. గమ్యస్థానం ఎంట్రీ చూస్తే.. ప్రస్తుతం మనమున్న లొకేషన్‌ నుంచి ఎలా వెళ్లాలో రూట్ చూపిస్తోంది గూగుల్.. నాలుగైదు దారులున్నా… ట్రాఫిక్ తక్కువగా ఉండే రూట్‌ను మరి వెతికి పెడుతుంది.. అంతేకాదు.. షాట్‌కట్స్‌ దారులను కూడా చూపిస్తోంది.. ఒక్కోసారి దారి తప్పితే.. నువ్వు దారితప్పిపోతున్నావు అంటూ హెచ్చరిస్తూనే ఉంది.. కానీ, గూగుల్‌ మ్యాప్‌ను నమ్మి ప్రయాణాలు సాగించడం కూడా కష్టమేనని చాలా ఘటనలు చెబుతున్నాయి.. తాజాగా… గూగుల్‌ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్లి ఓ కారు ఏకంగా డ్యామ్‌లోనే పడిపోయింది.. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది..  పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పుణెకు చెందిన గురు శేఖర్ ఒక ప్రైవేట్ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. అతడు.. తన మిత్రులు సమీర్, ఇంకో వ్యక్తితో కలిసి మహారాష్ట్రలో అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ మీదకు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. వీరికి కూడా శేఖర్ డ్రైవర్ సతీష్‌ ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం వేళ అక్కడకు బయలుదేరిన వీళ్లు మధ్యలో దారి తప్పిపోయారు. ఈ నేపథ్యంలో వాళ్లంతా తమ సెల్ ఫోన్లలో ఉన్న గూగుల్ మ్యాప్స్ లో దారి కోసం వెతకకగా.. ఒక రూట్ ను చూపించింది గూగుల్.. ఇక అది ఫాలో అవుతూ.. కొంతదూరం వెళ్లేసరికి చీకటి పడిపోయింది. అయినా.. గూగుల్‌ మ్యాప్‌ చూపిస్తుందన్న ధైర్యంతో.. వాళ్లు ఒక డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. ఆ డ్యామ్ పై ఉన్న బ్రిడ్జి దాటితే పక్కనున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ్నుంచి బయటకు వెళ్లిపోవచ్చు అని భావించారు.. మ్యాప్‌ బ్రిడ్జి చూపించగా.. కారు నడుపుతున్న వ్యక్తి.. చీకట్లో అక్కడ బ్రిడ్జి ఉందనుకుని కారును పోనిచ్చాడు.. దీంతో, నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. అయితే, అప్రమత్తమైన శేఖర్, సమీర్, మరో వ్యక్తి కారు డోర్లను తీసుకుని ఈదుతూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు.. కానీ, సతీష్‌ మాత్రం కారులోని చిక్కుపోయి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయాడు.

Related posts