telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ మంత్రివర్గం భేటీ.. తొలిబడ్జెట్ కు ఆమోదం..

ap ministers meet to accept budget

ఏపీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మంత్రి వర్గం భేటీ అయ్యింది. దాదాపు 45 నిమిషాల పాటు జరగనున్న ఈ భేటీలో 2019-20 రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదిస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. మంత్రివర్గ సమావేశానికి వెళ్లే ముందు బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించామన్నారు.

బడ్జెట్‌లో నవరత్నాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శాసనసభలో, మండలిపక్ష నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శాసనమండలిలో ప్రవేశపెడతారు. ఆ వెంటనే వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మండలిలో పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నారు. సోదరుడి హఠాన్మరణంతో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారు.

Related posts