telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పాక్ మోడల్ సోఫియా పై కిడ్నాప్ కేసు నమోదు

sofia mirja pakistan

పాకిస్తాన్ చిత్రపరిశ్రమలో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న సోఫియా మీర్జా పై గతంలోనే ఎన్నో అభియోగాలు వెలుగులోకి వచ్చాయి. మనీ లాండరింగ్, కిడ్నాప్ కేసుల్లో సోఫియా మీర్జాకు సంబంధాలు ఉన్నాయని పాక్ నేషనల్ అకౌంట్‌బులిటీ బ్యూరో తన దర్యాఫ్తులో తేల్చింది. ఈమెపై గతంలోనే ఎన్నో అభియోగాలు రాగా, ఆమె నేరాలపై ప్రాధమిక సాక్ష్యాలను సేకరించిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహా పలు దర్యాప్తు బృందాలు విచారణను వేగవంతం చేశాయి.

గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అనుమతి లేకుండా డాలర్లతో యూఏఈ వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. ఈమెపై కిడ్నాప్ కేసులు కూడా నమోదు కావడం గమనార్హం. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, మాజీ భర్త చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగమని సోఫియా మీర్జా వాదిస్తున్నా, ఆమె చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంది.

Related posts