బుల్లితెర రియాలిటీ షో తమిళ ‘బిగ్‌బాస్’తో పాపులారిటీ తెచ్చుకుని, మోడలింగ్, అందాల పోటీల నిర్వహణలో వివాదాల్లో చిక్కుకున్న నటి మీరామిథున్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి అందరికి షాకిచ్చారు. అంతేకాదు తమిళనాడులో తనకు భద్రత లేదని, అందువల్ల తాను వేరే రాష్ట్రానికి వెళ్లిపోవాలనుకుంటున్నట్టు చెప్పి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ మేరకు ఆమె చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ “నేను బిగ్‌బాస్ షోలో పాల్గొని, బయటకు వచ్చేసి రెండు నెలలవుతోంది. అయితే, ఇప్పటివరకు తనకు బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీని గురించి నేను విజయ్ టీవీ నిర్వాహకుల్ని సంప్రదిస్తే, సరైన సమాధానం దొరకలేదు. దాంతో నేను మోసపోయానని అర్ధమైంది. ఈలోపు నాపై అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది ఏ స్థాయిలో అంటే.. నేను తమిళనాడులో వుండలేని పరిస్థితుల్లోకి నెట్టేశారు. వేరే రాష్ట్రానికి వెళ్తేనే భద్రతగా ఉంటానని అనిపిస్తోంది. భవిష్యత్తులో నేను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను. అయితే ఏ పార్టీ అనేది ఇప్పుడే చెప్పలేను” అని పేర్కొంది. ప్రస్తుతం మీరామిథున్ మాటలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
previous post
next post
అభాండాలు వేసి, బూతులు తిట్టారు : శేఖర్ మాస్టర్