telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీముఖికి బిగ్ బాస్-3 ప్లస్ అవుతుందా ?

rahul sipliganj won bigg boss 3 title

ఆదివారం రాత్రి కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రకటించారు. శ్రీముఖికి రన్నరప్ టైటిల్ దక్కింది. బాబా భాస్కర్ మూడోస్థానంలో, వరుణ్ సందేశ్ నాలుగో స్థానంలో, అలీ చివరి స్థానంలో నిలిచారు. విజేతగా అవతరించిన రాహుల్ సిప్లిగంజ్‌కు టైటిల్‌తో పాటు రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీని మెగాస్టార్ చేతుల మీదుగా అందించారు నాగార్జున. మరి శ్రీముఖి రన్నర్ మాత్రమే ఎందుకు కాగలిగింది? ఆమె విన్నర్ అవ్వకుండా ఏయే అంశాలు అడ్డు తగిలాయి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. యాంకర్ శ్రీముఖి తొలి నుండి టాస్క్‌లతో పాటు పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకుంటూ టైటిల్ రేస్‌లో తానే నంబర్‌గా నిలుస్తోంది. ఇక ఆమెకు బయట కూడా అభిమానగనం ఘనంగా ఉండటంతో ఆమెదే టైటిల్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. అయితే ఏ మాత్రం అంచనాలు లేకుండా ఫైనల్‌లోకి వచ్చిన రాహుల్ అనూహ్యంగా చివరి వారాల్లో పుంజుకున్నారు. శ్రీముఖితో వైరం.. పాతబస్తీ పోరడు.. ఎక్కువ సార్లు నామినేట్ అయిన కంటెస్టెంట్‌గా ఆడియన్స్‌లో సింపథీ గెయిన్ చేసుకున్నారు రాహుల్. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 14 వారాల్లో (15 వారంలో నామినేషన్స్ లేవు) 11 సార్లు నామినేషన్‌లోకి వెళ్లి.. ఈ సీజన్‌లో ఎక్కువ సార్లు నామినేట్ అయ్యి సేవ్ అయిన కంటెస్టెంట్‌ అయ్యాడు. టాస్క్‌లు ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల కెప్టెన్ కూడా కాలేకపోయాడు రాహుల్. అయితే విన్నర్ కావడానికి ఇవేమీ అవసరం లేదని రుజువుచేశాడు రాహుల్. తన నేటివిటీని ఒరిజినాలిటీని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ తను బార్బర్ అనే విషయాన్ని ప్రమోట్ చేసుకుని సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్. బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చిన రూ. 50 లక్షలతో ఏం చేస్తావ్ అంటే.. ఓ బార్బర్ షాప్ పెడతా.. నా కుల వృత్తిని నేను వదులు కోను. అది చేయడానికి గర్వపడతా అంటూ రాహుల్ చెప్పిన మాటలు ఆ వర్గం వారికి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో పాటు శ్రీముఖిని విజేతను చేసేందుకు బిగ్ బాస్ వాళ్లతో కుమ్మక్కు అయ్యారనే విషయం జనంలోకి బాగా వెళ్లిపోవడంతో రాహుల్‌కి బాగా కలిసి వచ్చింది. వాళ్లు విజేతను ప్రకటించడం ఏంటి? ఓట్లు వేయాల్సింది మేం కదా.. అని ఆడియన్స్ గంపగుత్తగా ఓట్లు రాహుల్‌కి గుద్దేశారు. ఇంకా బాబా భాస్కర్, వరుణ్, అలీలు ఉన్నారు కదా.. వాళ్లకు ఎందుకు ఓట్లు పడలేదు అంటే.. రాహుల్‌కి శ్రీముఖితో ఉన్న వైరం అతనికి వరంలా మారింది. 11 వారాలు వరుస నామినేషన్స్‌తో పడుతూ లేస్తూ వస్తున్న రాహుల్‌కే జనం జై కొట్టారు. శ్రీముఖీ విజేత అయివుంటే ఇక ఆమెకు ఆకాశమే హద్దు అయ్యేదేమో. ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ బిగ్ బాస్ షో ద్వారా ఆమె తన బ్రాండ్‌ను బాగానే పెంచుకుంది. ఇప్పటివరకూ ఓ యాంకర్‌గా చిన్న చిన్న షోలకు మాత్రమే పరిమితమైన ఆమె, ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ అనే బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకుంది. ఫలితంగా ఆమెకు టాలీవుడ్ నుంచీ మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి. హీరోయిన్‌గా కాకపోయినా ఇతర కేరక్టర్లలో మెరిసే ఛాన్సులున్నాయి. 

Related posts