telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌పై ఉన్న సీబీఐ కేసును ఎందుకు విచారించడం లేదు: ఉత్తమ్

uttam congress mp

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ కలిసి నాటకాలాడుతున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు ఐదేళ్ల పాటు బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. పార్లమెంట్‌లో కేసీఆర్ పనితీరును మోదీ ప్రశంసించలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై ఉన్న సీబీఐ కేసును ఎందుకు విచారించడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏంచేసిందని పుంజుకుంటుందని ఉత్తమ్ ప్రశ్నించారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో అదృష్టవశాత్తు బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయని పేర్కొన్నారు.

Related posts