telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ సీఎం జగన్ దంపతులు

సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కరోనా వ్యాక్సిన్‌ను ఇవాళ తీసుకున్నారు. గుంటూరు-అమరావతి రోడ్డులోని భారత్‌పేట 140 వ వార్డు సచివాలయంలో సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతీలు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. నిబంధనల ప్రకారం వైద్యుల పర్యవేక్షణలో అరగంటపాటు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా సచివాలయం, వైద్య సిబ్బందితో సీఎం జగన్‌ సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌.. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు. రానున్న 90 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని.. కరోనాను రూపుమాపలేమని తెలిపారు. కరోనాతో సహజీవనం తప్పదని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్‌. దీనిని నిరోధించడానికి వ్యాక్సిన్‌ ఒక్కటే దిక్కన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ.. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు సీఎం జగన్‌.

Related posts