telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దుమ్ము రేపుతున్న “సారంగ దరియా” తెలుగు సినిమా చరిత్రలోనే కొత్త రికార్డు

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న దృశ్య కావ్యం లవ్ స్టోరి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కారణం..లవ్ స్టోరి ఒక్కో పాట ఆణి ముత్యాల్లా తయారై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. రెండు వారాల కిందట రిలీజ్ చేసిన ‘సారంగ దరియా’  లిరికల్ వీడియో నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. తెలుగు సినిమా రంగంలో అత్యంత త్వరగా వంద మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న లిరికల్ వీడియోగా ‘సారంగ దరియా’ నిలిచింది. వంద మిలియన్ వ్యూస్ ను సౌత్ లో అందుకున్న రెండో సినిమా ఇది! దీనికి ముందు ‘రౌడీ బేబీ’ సాంగ్ ఇలానే అత్యధిక వ్యూస్ దక్కించుకుంది. విశేషం ఏమంటే… ఈ తమిళ సాంగ్ లో నర్తించింది కూడా సాయిపల్లవే! ‘లవ్ స్టోరీ’ మూవీకి పవన్ సిహెచ్ స్వరాలు సమకూర్చారు. అయితే… తెలంగాణ జానపద గీతం ‘సారంగ దరియా’ పై చెలరేగిన వివాదం కూడా ఈ పాటకు ఇన్ని వ్యూస్ రావడానికి కారణమైంది. కాగా..ఏప్రిల్ 16న ”లవ్ స్టోరి” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts