కరోనా మహమ్మారి విస్తరించిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు ప్రత్యేక విమానాలు నడుపుతూ రిలీఫ్ మెటీరియల్ ను, చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తరలిస్తూ ఎన్నో దేశాల మన్ననలను అందుకుంది. తాజాగా, ఆ జాబితాలో పాకిస్థాన్ కూడా చేరిపోయింది. ఎయిర్ ఇండియాను చూస్తుంటే, తమకు చాలా గర్వంగా ఉందని, అనిశ్చిత స్థితి పెరిగిపోయిన నేపథ్యంలో ఆ సంస్థ అమోఘమైన కృషి చేస్తోందని కితాబిచ్చింది.
ఏప్రిల్ 2న ముంబై నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు కరోనా రిలీఫ్ మెటీరియల్ ను తీసుకుని రెండు ఎయిర్ ఇండియా విమానాలు బయలుదేరాయి. నరేంద్ర మోదీ, టోటల్ లాక్ డౌన్ ను ప్రకటించిన తరువాత జర్మనీకి బయలుదేరిన తొలి విమానాలు ఇవే. ఈ విమానాలు ముంబై నుంచి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో టేకాఫ్ తీసుకుని, సాయంత్రం 5 గంటల సమయంలో పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లాయి.
రేపు పాకిస్థాన్ కూడా టార్గెట్.. ఆరెస్సెస్ పై ఇమ్రాన్ ఫైర్