telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

గూగుల్ సంస్థపై విరిగిపడిన 90 అడుగుల క్రేన్

అమెరికాలోని సియాటెల్‌లో గూగుల్ సంస్థ ఆఫీసు కోసం చేస్తున్న నిర్మాణంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం భారీ గాలులు వీయడంతో భవన నిర్మాణంలో ఉపయోగిస్తున్న ఓ క్రేన్ విరిగిపడింది. 9వ అంతస్తు నిర్మాణం కోసం ఈ క్రేన్‌ను ఉపయోగిస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్డు పక్కనే ఈ నిర్మాణం జరుగుతోంది. ఈ క్రేన్ గాలికి ఊగడాన్ని దూరం నుంచి చూసిన కొందరు వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గమనించని కొందరు ముందుకు వెళ్లి ఆ క్రేన్ కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు క్రేన్ ఆపరేటర్లు, ఇద్దరు వాహనదారులు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అమెజాన్, గూగుల్ వంటి బడాబడా సంస్థలన్నీ సియాటెల్‌లో ఆఫీసుల నిర్మాణం చేపట్టడంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో క్రేన్‌లు దర్శనమిస్తున్నాయి.

Related posts