telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కశ్మీర్ విషయంలో … జోక్యం చేసుకుంటామంటున్న బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ …

britain labour party on J & K issue

బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం కోరుతూ అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది. బ్రిగ్టాన్ సిటీలో జరిగిన సదస్సులో…కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం, ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో రిఫరెండమ్ కోరుతూ లేబర్ పార్టీ ఓ తీర్మానాన్ని పాస్ చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్(UNHRC) కూడా కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలని జెరెమీ కోర్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ తీర్మాణంలో తెలిపింది. బ్రిటన్ అధికార కన్జర్వేటవ్ పార్టీ మాత్రం అధికారికంగా కశ్మీర్ ఇష్యూని భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని అధికారికంగా చెబుతుండడాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ తప్పుబడుతోంది.

మరోవైపు కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం కోసం బ్రిటన్ లేబర్ పార్టీ అభ్యర్థించడాన్ని భారత్ విమర్శించింది. లేబర్ పార్టీ తీర్మాణాన్ని భారత్ తప్పుబట్టింది. తప్పుడు అభిప్రాయలపై ఆధారపడి ఆమోదించిన ఈ తీర్మానం భ్రమలకు తావిచ్చేలా ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఓటు బ్యాంకు ప్రయోజనాల’ కోసమే లేబర్ పార్టీ ఈ చర్యకు దిగిందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ అన్నారు. లేబర్ పార్టీ తీర్మాణం అనంతరం…లండన్ లోని భారత హైకమిషన్ లేబర్ పార్టీకి డిన్నర్ రిసెప్షన్ రద్దు చేసిందని, వారికి ఆహ్వానాలను పంపడాన్ని కూడా ఉపసంహరించుకుంది ఓ సీనియర్ అధికారి తెలిపారు.

Related posts