telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

రాత్రి సమయంలో ఫోన్‌ వాడుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

రాత్రి సమయంలో ప‌డుకోబోయేముందు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా?..బెదురూమ్ లో లైట్ ఆఫ్ చేచి అయితే, ఆ అల‌వాటును మానుకోవాల‌ని ఆరోగ్యం ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు*. 

     రాత్రి ప‌డుకోబోయే ముందు కాస్త తీరిక స‌మ‌యం దొరక‌డంతో ఎంతో మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు మంచంపై ప‌డుకోనే ప్రెండ్స్‌తో చాటింగ్ చేయ‌డం, ఫోన్ చేసి మాట్లాడ‌డం వంటివి చేస్తుంటారు.

 

ఈ అల‌వాటుతో నిద్రలేమి, కంటిచూపు దెబ్బతిన‌డం వంటి ప్రమాదాలు ఉంటాయ‌ని సుమారు వెయ్యి మంది మీద అధ్యయనం చేసిన త‌రువాత ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కులు వివ‌రించారు. ప‌డుకోబోయే ముందు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తే గాఢనిద్ర పట్టదని తెలిపిన ప‌రిశోధ‌కులు… దాంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటార‌ని చెబుతున్నారు. చీకట్లో ఛాటింగ్ చేస్తే కంటి రెటీనా మీద ప్రభావం పడుతుందని తెలిపారు. రాత్రుళ్లు స్మార్ట్‌ఫోనును దూరంగా పెట్టి నిద్ర‌పోవాలి 

                     అలాగే ఈ కంటి చూపుకు కూడా. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును పెంచే ఆహారాల గురించి క్రింద ఇవ్వడం జరిగింది. ఆ ఆహార పదార్దాలను విరివిగా తీసుకోండి.

 

1.) #మునగ_ఆకులు: మనందరికి మునగ కాయ తెలుసు. వాటి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మునగ ఆకులలో విటమిన్ – ఎ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటి ఆకులను పప్పుతో కలిపి వండుకుని తింటే చాలా మంచిది.

 

2.) #విటమిన్ – సి (Vitamin- C) ఎక్కువగా ఉండే పళ్ళు అయినటువంటి నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.

 

3.) వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాల పదార్దాలు , క్యారెట్లు, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.

 

#కంటి_వ్యాయామాలు(Eye Excercises) :

మన శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మన కంటికి కూడా అంతే అవసరం. ప్రతి రోజు కొద్దీ సేపు ఈ కంటి వ్యాయామాలు చెయ్యడం వలన కంటి చూపు వృద్ధి చెందుతుంది. దీనికి ప్రత్యేకంగా సమయం కేటాయించవలసిన అవసరం లేదు. ఎప్పుడు సమయం ఉంటె అప్పుడు, ఏ ప్రదేశంలో అయినా సులువుగా ఈ వ్యాయామాలు చేసుకోవచ్చు. ఈ క్రింద చిత్రంలో చూపించిన విధంగా కళ్ళను కదుపుతూ ప్రతి రోజు కొంత సేపు కంటి వ్యాయామాలు చెయ్యండి.

 

20-20-20 #రూల్_ని_పాటించండి:

 

మీరు ఎక్కువగా కంప్యూటర్ ముందు పని చేసేవారైతే మీ కళ్లు ఎక్కువగా అలసటకు గురవుతాయి. ఆ సమయంలో ఈ 20-20-20 రూల్ ని పాటించండి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మీరు బ్రేక్ తీసుకుని కంప్యూటర్ ని కాకుండా 20 మీటర్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్ల పాటు చూడండి . ఇదే 20-20-20 రూల్. ఇది కళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

#పొగ_త్రాగకండి:

          పొగ త్రాగడం అనేది కేవలం ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, జుట్టు, చర్మం, పళ్ళు చివరకు కళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. పొగ త్రాగే వారికి భవిష్యత్తులో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి పొగ త్రాగకండి.

 

#రాత్రి_సమయంలో_ఎక్కువగా_మొబైల్_ఫోన్_వాడకండి.

         ఈ రోజుల్లో చాలా మంది చాటింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ రాత్రిపూట ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల మనకు తెలియకుండానే మన కళ్ళు ప్రమాదంలో పడుతున్నాయి. మన జీవితాంతం ఉండవలసిన మన కంటి చూపు కన్నా అవి ముఖ్యమైనవా? ఒకసారి ఆలోచించండి.

 

మీ ఉద్యోగంలో భాగంగా మీరు ఎక్కువగా కంప్యూటర్ ని ఉపయోగిస్తున్నట్లైతే కంప్యూటర్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ వలన కళ్ళు దెబ్బ తినకుండా ఉండడం కోసం Anti-Glare Glasses ని ఉపయోగించండి.

 

 

Related posts