telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ ఆఫర్ ను వదులుకున్న సమంత

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌ ప్ర‌స్తుతం 96 రీమేక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు స‌మాచారం. దిల్ రాజు 96 రీమేక్ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు “ది ఫ్యామిలీ మ్యాన్” సీజ‌న్ 2 వెబ్ సిరీస్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగా, దానిని సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌. స‌మంత క‌న్న‌డ చిత్రానికి రీమేక్‌గా యూట‌ర్న్ అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీకి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో హిందీలోను రీమేక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హిందీ రీమేక్‌లోను స‌మంత‌నే ప్ర‌ధాన పాత్ర కోసం ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావించ‌గా, ఈ ఆఫ‌ర్‌ని సామ్ రిజెక్ట్ చేసింద‌ట‌. చేసిన పాత్ర‌ని మ‌ళ్ళీ చేయ‌డం అంత మంచిగా అనిపించ‌దు అని వ‌చ్చిన ఆఫర్‌ని వ‌దులుకుంది స‌మంత‌. దీంతో స‌మంత పాత్ర‌లో తాప్సీని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ వార్త‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

Related posts