telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్‌ విడుదల

Degree exams TDP questiona Anantapur

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్‌సీ, యానిమల్‌ హజ్‌ బెండరీ, బీఎఫ్‌ఎస్‌సీ, బీ ఫార్మసీ, ఫార్మ–డీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్‌–2019 నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు ఎంసెట్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు తెలిపారు. కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో వరుసగా మూడోసారి ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

అపరాధ రుసుం లేకుండా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 4 వరకూ, రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 9 వరకూ, రూ.5 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 14 వరకూ, రూ.10 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 19 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. http://sche.ap.gov.in/eamcet వెబ్‌సైట్‌ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. హాల్‌టిక్కెట్లను ఏప్రిల్‌ 16 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. ఇంజినీరింగ్‌ పరీక్షను ఏప్రిల్‌ 20, 21, 22, 23 తేదీల్లోను, అగ్రికల్చర్‌ పరీక్షను ఏప్రిల్‌ 23, 24 తేదీల్లోను నిర్వహిస్తామని తెలిపారు.

Related posts