telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

“కరోనా నివారణకు నడుం బిగించు”

ఎవడు కన్నదో ఏ దిక్కునుంచోచ్చిందో తెల్వదు 

లోకాలను ఏకి పారేస్తోంది దిక్కుమాలింది కరోనా 

లోకం తీరు మార్చేకి వచ్చిందో కలికాలచీడ పురుగు 

 

పొరబడితి త్వరబడితి నాకు రాదని నిర్లక్ష్యమే మానుకోండి! ఎవర్ని వదలదు దరిద్రపు బొమ్మాలి  

ప్రజలందరికి ప్రాణహాని తలపెట్టే త్రాచుపాములెక్క 

బ్రతుకు తెరువు కొరకు బార్డర్లు దాటి పనికొస్తే 

కరోనా కాలకూట విషమై పేదల పాలిట కర్కశమైంది!!

 

కాదేది కరోనాకర్హం కులం మతం 

చిన్న పెద్ద అన్న తేడా లేదోయ్ 

మొహమ్మారీ కంటపడితే చాలోయ్ చితిమేస్తోంది 

ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరితిత్తులో తిష్టవేస్తోంది

కకావికలం చేస్తోంది కఠినధోరణిగా వ్యవహరిస్తోంది!!

 

కారణమేదైనా కరోనా రావడం కాయం 

లోకుపాలిట యమపాశమై ప్రాణం తీసి 

శవాలమీద కన్నీటి శోక నాట్యమాడేస్తోంది!!

శవాలు గుట్టలూ గుట్టలుగా మంటల్లో కాలిపోతున్నవి!!

 

కరోనా నివారణకు మనమే నడుం బిగించి 

సామాజిక దూరం పాటించు శానిటేషన్ రాసుకో 

తప్పనిసరిగా మాస్క్తో మూతి ముక్కు మూసుకో  

మనకు మనమే రక్షణ మనం పాటించే తీరే శ్రీరామరక్ష!!

~~~~~~~~~~~~~~~~~

దాదిగిరి నరేష్ 

ఉమా శ్రీ ✍️

Related posts