telugu navyamedia
ఆంధ్ర వార్తలు విద్యా వార్తలు

ఆన్ లైన్లో ఏపీ స్కూల్ టెక్స్ట్ బుక్స్..

ఏపీలో ఇకపై ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ పాఠ్యపుస్తకాల్ని ఆన్ లైన్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ మొత్తం 373 పాఠ్యపుస్తకాలు ఉండగా.. వాటిలో 350 పుస్తకాలను ఇలా ఆన్ లైన్లో అందుబాటులోకి తెచ్చారు. మిగతా పాఠ్యపుస్తకాలను కూడా త్వరలో పీడీఎఫ్ రూపంలో అప్ లోడ్ చేస్తారు. అయితే వీటిని వాడుకునే విషయంలో ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దీని ప్రకారం ఈ పాఠ్యపుస్తకాలను విద్యార్ధులు వ్యక్తిగతంగా వాడుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు.

https://cse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యాపార నిమిత్తం ప్రచురించడాన్ని మాత్రం నిషేధించారు. ఈ ఆన్ లైన్ పీడీఎఫ్ పుస్తకాల్ని అక్రమంగా ముద్రించినా, అమ్మినా, మార్పులు చేర్పులు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించంది.

Related posts