1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశవ్యాప్తంగా జరిగిన సిక్కుల ఊచకోతలకు అప్పటి హోంమంత్రి పి.వి.నరసింహారావు తప్పుడు నిర్ణయమే కారణమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను పి.వి. మనవడు సుభాష్ తప్పుపట్టారు. మన్మోహన్ వ్యాఖ్యలు సమర్థించేవిగా లేవని, పీవీ కుటుంబ సభ్యునిగా ఈ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. సిక్కులపై దాడులు జరుగుతున్నప్పుడు ఆర్మీని రంగంలోకి దించాలని అప్పటి హోంమంత్రి పీవీకి గుజ్రాల్ సూచించినా ఆయన పట్టించుకోలేదని, అందువల్లే దురదృష్టకర పరిణామాలు జరిగాయని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.ఈ నేపధ్యంలో సుభాష్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ తమ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సిక్కుల ఊచకోతకు సంబందించి అప్పటి హోం మంత్రిగా ఉన్న పివిని తప్పు పట్టిన మన్మోహన్ మరి ఎందుకు రాజీవ్ గాందీ గురించి మాట్లాడలేదని, ప్రదాని గా ఉన్న రాజివ్ ను వదలి పివిని తప్పు పడతారా అని ఆయన అన్నారు.అలాంటప్పుడు పివి క్యాబినెట్ లో మన్మోహన్ ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు.ఆ తర్వాత పదేళ్లు సింగ్ ప్రదాని గా ఉన్నప్పుడు కూడా ఈ ప్రస్తావన తేలేదని ఆయన అన్నారు. క్రెడిట్ అంతా కాంగ్రెస్ కు, అపఖ్యాతి అంతా పివికి అంటగట్టడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని సుభాష్ మండిపడ్డారు.
వంద రోజుల పాలనలో ఏ ఒక్కపనీ చేపట్టలేదు: చంద్రబాబు