telugu navyamedia
రాజకీయ వార్తలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను వద్దంటున్నారు?

evm issues even in 4th schedule polling

భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంల పై పతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈవీఎంల వినియోగంలో లోపాలున్నాయంటూ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం విధితమే. అగ్ర రాజ్యమైన అమెరికా అధ్యక్షునిగా పోటీ చేసున్న అభ్యర్థి కూడా ఈవీఎంల పై సందేహాలు వ్యక్తం చేశారు. బ్యాలట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరిపించాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ఈవీఎంల తీరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

మొన్న దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పోలైన ఓట్లకు ఈవీఎంల నిక్షిప్తమైన ఓట్లకు భారీగా తేడా ఉన్నట్టు స్పష్టమైంది. గుజరాత్ లోని ఓ నియోజకవర్గంలో లక్ష పై చిలుకు ఎక్కువగా వచ్చాయి. అధేవిధంగా బీహార్ లో కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో వేల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇన్ని లోపాలున్న ఈవీఎంల పై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఎవరెన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు.

దేశంలో 60 లక్షల ఈవీఎంలను ఆయా కంపెనీలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. అయినపట్టికీ ఎన్నికల కమీషన్ మాత్రం ప్రభుత్వం మాకు అందజేసిన ఈవీఎంలు 40 లక్షలు మాత్రమే అని చెబుతుంది. మిగతా 20 లక్షల ఈవీఎంలు ఏమైనట్టు అనే దాని పై ప్రభుత్వం మౌనం వహించడంతో పలువురిలో సందేహాలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ ఈ వ్యవహారం పై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఈవీఎంల సందేహాలను నివృత్తి చేయడంలేదని దేశ వ్యాప్తంగా విమర్శలు వెళ్లువిరుస్తున్నాయి.

Related posts