కరోనా కట్టడి చేసేందుకు అమలవుతున్న లాక్‌డౌన్ కు ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద మంత్రి బైక్ ర్యాలీ ద్వారా పర్యటించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బంగల్ పేటలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ప్రభుత్వం మే 7 వరకు లాక్ డౌన్ పొడిగించిందని తెలిపారు.
నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు వైద్య, పోలీసు మున్సిపల్ రెవెన్యూ శాఖలు కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలుకు ఎనలేని కృషి చేస్తున్నాయని తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక మీటర్ సామాజిక దూరం పాటించాలని, ఇంట్లో నుండి బయటకు రావద్దని మంత్రి కోరారు. ప్రజలకు కూరగాయల కోసం ఇబ్బందులు లేకుండా కలుగకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.
ప్రజావేదికను కూల్చి ప్రజాధనాన్ని నీళ్ల పాలు చేశారు: కన్నా