telugu navyamedia
రాజకీయ

మా కుటుంబాలకు ఏదైనా జరిగితే థాక్రాదే బాధ్య‌తా -ఏక్‌నాథ్ షిండే

*మాకు మా కుటుంబ స‌భ్య‌లకు ఏం జ‌రిగినా థాక్రాదే బాధ్య‌తా
*డీజీపీ హోంమంత్రికి లేఖ‌రాసిన ఏక్‌నాథ్ షిండే

మ‌హారాష్ర్ట‌లో ఏర్ప‌డ్డ రాజ‌కీయ సంక్షోభం రోజు రోజుకు తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిసీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌, డీజీపీతో పాటు, రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లకు శివ‌సేన తిరుగుబాటు నేత‌ ఏక్‌నాథ్ షిండే లేఖ రాశారు.

తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కాని, తన కుటుంబ సభ్యులకు కాని ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని షిండే లేఖలో పేర్కొన్నారు. భద్రత తొలగింపుపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఎన్సీపీ, ఐఎన్‌సీ గూండాలతో కూడిన ఎంవీఏ ప్రభుత్వం డిమాండ్‌లను అంగీకరించడానికి మాపై ఒత్తిడి తేవడానికి, మా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ దుర్మార్గపు చర్య మరొక ప్రయత్నం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’’ అని ఏక్‌నాథ్ షిండే లేఖలో పేర్కొన్నారు.

Maharashtra crisis LIVE | 37 rebel MLAs write to Dy Speaker, declare Eknath  Shinde as their leader- The New Indian Express

ఎంవిఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు.. తమ శాసనసభ్యులపై హింసాత్మక చర్యలకు పాల్పడేలా వారి కార్యకర్తలను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. శాసనసభ్యుల కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే, సేన ఎంపీ సంజయ్ రౌత్ సహా మహా వికాస్ అఘాడీ అగ్రనేతలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. వెంటనే తమ కుటుంబాలకు భద్రతను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

కాగా గౌహతిలో ఉన్న ఏక్‌నాధ్ షిండే క్యాంప్ లో ప్రస్తుతం యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు షిండే క్యాంప్ కు క్యూ కడుతున్నారు. మరోవైపు షిండే క్యాంప్ లో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ కార్యదర్శికి శివసేన లేఖ ఇచ్చింది. దీనిపై న్యాయనిపుణులతో అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయం సంప్రదింపులు జరుపుతుంది. న్యాయనిపుణుల సూచనల మేరకు చర్యలు ఉంటాయని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ప్రస్తుత పరిణామాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది

Related posts