telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

బెంగళూరు యూకో బ్యాంకు భవనంలో అగ్నిప్రమాదం

uco bank fire banglore

బెంగళూరు నగరంలోని బ్యాంకు భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులోని యూకో బ్యాంకు బహుళ అంతస్తుల భవనంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాల్లో వ్యాపించాయి. భవంతిలో పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు సురక్షితంగా తరలిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts