telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేడు హైకోర్టులో “దిశ ఎన్ కౌంటర్” చిత్రం విచారణ

Disha

గత ఏడాది హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన దిశ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో దిశపై లైంగిక దాడి, హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే ఈ ఘటనని ఆధారంగా చేసుకుని వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ “దిశ ఎన్‌కౌంటర్‌ ” అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సినిమాను ఈ నెల 26న విడుదలకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను విడుదల చేశారు రాం గోపాల్‌ వర్మ. అయితే ఈ సినిమా విడుదల కాకుండా ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి. ఈ విషయంపై నవంబర్ 6న హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సినిమా వల్ల చనిపోయిన తమ కూతురుతో పాటు బతికున్న మా కుటుంబానికి కూడా ఇబ్బంది కలుగుతుందని, అందుకే దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశాడు దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి. ఈ చిత్రాన్ని వెంటనే ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటీషన్ దాఖలైంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతున్నారు అంటూ దిశ తండ్రి ఫిర్యాదు చేశాడు. వాటిని తొలగించాలని సీసీఎస్ పోలీసులను కోరుకున్నాడు ఆయన. దిశ సంఘటన జరిగిన నవంబర్ 26నే ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే సుప్రీం జ్యుడీషియల్ కమిషన్ కు సినిమా ఆపాలని నిందుతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ వాళ్లను పూర్తిస్థాయిలో ప్రతినాయకులుగా చూపిస్తున్నారని, దానివల్ల తమ కుటుంబాలకు చెడు జరిగే అవకాశం ఉంది అంటూ వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై మరోమారు హైకోర్టులో విచారణ జరగనుంది.

Related posts