telugu navyamedia
సినిమా వార్తలు

తన కుమార్తెను వదిలేయమంటున్న స్టార్ హీరో

Ajay-Devagan

తన కుమార్తెను వదిలేయమంటూ ట్రోలర్స్ ను కోరారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. తన కుమార్తె వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాలు మాత్రమేనని, తన శరీరాకృతి, వేసుకునే దుస్తులపై ట్రోలర్స్ చేస్తున్న కామెంట్స్ చూసి ఆమె ఏడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లల ఫోటోలు తీసి పబ్లిష్ చెయ్యొద్దని కోరిన అజయ్ మీడియా శ్రద్ధ చూపిస్తుండడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తన పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే అందులో నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయని, మీడియా తీస్తున్న ఫొటోల్లో తాము ఎక్కడ కన్పించమోనన్న ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తాను, తన భార్య సెలెబ్రిటీలం కాబట్టి ఏమన్నా పట్టించుకోబోమని, కానీ తనకున్న పాపులారిటీతో తన పిల్లలు బాధపడుతున్నారని, పిల్లలన్న సంగతి కూడా మరిచి అసభ్య కామెంట్లు చేస్తున్నారని, తన పిల్లలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.

Related posts