telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీపై ప్రశంసలు కురింపించిన ఆర్జీవీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వచ్చిన చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబ‌ర్‌7న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. సినిమాలోని పాటలు కూడా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి.

ఈ సినిమాపై సినీ ప్ర‌ముఖులు ప్రశంసలు వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ…హేయ్ అల్లు అర్జున్, ఆంథిమ్, సత్యమేవ జయతే 2, 83 వంటి సినిమాలున్నా కూడా.. వాటిని వెన‌క్కి నెట్టి ..పుష్పతో రీజనల్ సినిమాను నేషనల్ లెవల్‏కు తీసుకెళ్లావ్.. కుదోస్ అని బన్నీపై ప్రశంసలు కురిపించాడు.

Pushpa' Box Office Collection Day 1: Allu Arjun starrer makes a solid  opening in Tamil Nadu | Tamil Movie News - Times of India

అంతేకాకుండా… ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‎లో పుష్ప మూవీ జనవరి 7న స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న నటించగా.. అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటించారు.

Related posts