telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గుంపులో గోవింద అనుకున్న కానిస్టేబుల్ .. అసహ్య ప్రవర్తన బట్టబయలు..

constable misbihave with protesting women

నేడు యునానీ విద్యార్థులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. ఆయుర్వేద భవన్‌ను ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ వీళ్లు కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. అయితే విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో ఓ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు జుగుప్సను కలిగించింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి బలవంతంగా వాహనం ఎక్కించే క్రమంలో ఓ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఏదో సినిమాలో చూపించినట్టుగా.. కాళ్లతో తొక్కి, గోళ్లతో గట్టిగా గిచ్చడంతో సదరు విద్యార్థిని బాధతో అరుస్తూ విలవిల్లాడిపోయింది. ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కడంతో సదరు కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో కానిస్టేబుల్ ప్రవర్తనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆరా తీస్తున్నారు.

Related posts