telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అక్కడ రంజాన్ ఉపవాస దీక్షలపై నిషేధం… ఎవరైనా అతిక్రమిస్తే…

Ramadan

పవిత్రమైన రంజాన్‌ మాసంలో ఉపవాసదీక్ష చేయని ముస్లింలు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. కానీ చైనాలో ఉపవాసం చేయడం నిషేధం. కమ్యూనిస్టు ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం ఇలాంటి ఉపవాసాలు తీవ్రవాదానికి దారితీస్తాయి. 2015లో తొలిసారిగా విధించిన ఈ నిషేధాన్ని ఈ ఏడాది కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఉయ్‌ఘరు,్ల ఇతర ముస్లిం గ్రూపులు ఎక్కువగా ఉన్న వాయవ్యప్రాంత జిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో దీనిని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఇక్కడ ఉన్న దాదాపు కోటి మంది ఉయ్‌ఘర్లు ముస్లింలపై పూర్తి నిఘా కొనసాగుతోంది.

ఎవరైనా ఉపవాస దీక్ష చేసినట్లు తేలితే కాన్‌సన్‌ట్రేషన్‌ (రీఎడ్యుకేషన్‌) శిబిరాలకు తరలిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రతీ కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా ఈ కేంద్రాలకు వెళ్లి, వారాల తరబడి ఉండి, చైనా అధికారుల చేత పాఠాలు చెప్పించుకొని వస్తున్న పరిస్థితి. రంజాన్‌ ఉపవాసదీక్షలపై నిషేధాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్‌గ్రూపులు నిరసిస్తున్నాయి. మత స్వేచ్ఛను అడ్డుకోవద్దని చైనాను హెచ్చరిస్తున్నాయి.

Related posts