telugu navyamedia
సినిమా వార్తలు

కన్నీటి వీడ్కోలు మ‌ధ్య‌ సిరివెన్నెల అంతిమ యాత్ర..

అనారోగ్యంతో చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగీత ప్రేమికులు సిరివెన్నెల లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సెలవంటూ వెళ్లిపోయారు సిరివెన్నెల.

ఫిల్మ్ ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు సిరివెన్నెల అంతిమయాత్ర మొద‌లైంది. ఉదయం 5 గంటలనుంచి ఫిలిం నగర్ లోని ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్ధివదేహాన్ని సినీప్రముఖుల, అభిమానుల సందర్శనార్ధం ఉంచారు.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇక ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియలను తీసుకువెళ్తున్నారు కుటుంబసభ్యులు. వేలాదిమంది అభిమానుల ఆశ్రునయనాలమధ్య తెలుగు సాహిత్య సారధి సెలవంటూ కదిలారు.

చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలంతా సిరివెన్నెల పార్థివదేహం సందర్శించి చివరిసారిగా నివాళులు అర్పించారు.

సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. తెలుసా మనసా అనే పాట నాకు గుర్తు వస్తుంది. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇదే మాటలు వినిపిస్తూ ఉంటారు

సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు.ఆయన మరణం చాలా బాధ కలిగించిందని, గొప్ప సాహిత్య సినీ గేయ రచయిత కనుమరుగు అయ్యారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

కొన్ని కొన్ని సార్లు మన ఆవేదనను, భాదను వ్యక్తపరచడానికి మాటలు రావు . అలాంటి భావాలను ఆ మహానుభావుడు తన కలంతో వ్యక్తపరిచారంటూ జూనియర్ ఎన్టీఆర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు..బహుశా ఈ ఆవేదానును ఆయన తన కలంతోనే వ్యక్తపరిస్తే బావుండేదని తారక్ ఎమోషనల్ అయ్యారు. సీతారామ శాస్త్రి గారి కలం ఆగిన..ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన పాటలు, అక్షరాలు, తెలుగు జాతి, తెలుగు భాష బ్రతికున్నంతకాలం చిరస్మరణీయంగా ఆ సాహిత్యం మిగిలిపోతుంది. రాబోయే తరాలకు ఆ సాహిత్యం బంగారు బాటలు వేయాలని అన్నారు . పైనుంచి ఆయన చల్లను చూపు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుడిని కోరుంటున్నానని తారక్ అన్నారు

సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించిన సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకుండా తెలుగు పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని మహేశ్‌ అన్నారు. 

Related posts