టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా నరసింహ స్వామి సన్నిధిలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలో దర్శకుడు మెహర్ రమేష్ తో పాటు పాపులర్ సినిమాటోగ్రాఫర్ డూడ్లీ కూడా ఉన్నారు.
కాగా ప్రస్తుతం మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్” సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాలో చిరంజీవికి జతగా కీర్తి సురేష్, తమన్నా భాటియా కథానాయికలుగా నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. “భోళా శంకర్”పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం,
సింహాచలం 🙏🏻
Devine visit of Sri VarahlaksmiNarsimhaswamy temple 🙏🏻#SimhachalamTemple along with my dear friend &Dop @dudlyraj pic.twitter.com/sXPwKn0jp6— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) April 14, 2022