telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒకే వేదికపై జగన్, బాలకృష్ణ, ఎన్టీఆర్… అరుదైన దృశ్యం

Jagan-andBalakrishna

తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వేరుపడిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను ఇప్పటివరకూ ఇవ్వలేదు. 2014 , 2015 , 2016 సంవత్సరాలకి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది కానీ ఇవ్వలేదు. ఇక కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం నంది అవార్డ్స్ ఇవ్వటానికి సిద్దమైనట్లు సమాచారం. జగన్ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య కొంత గ్యాప్ నడుస్తోంది. అయితే ఆ గ్యాప్ పోవాలంటే ఇప్పటికిప్పుడు ఆ నంది అవార్డ్స్ ఇచ్చేస్తే సరిపోతుందని జగన్ సన్నిహితులు భావించినట్లు తెలుస్తుంది. ఇక జగన్ కూడా అవార్డులను ప్రదానం చేయడానికి ఓకే చెప్పారని తెలుస్తోంది. 2014, 2015, 2016 సంవత్సరాలకి గాను బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఒకేసారి మూడేళ్లకు సంబంధించిన నంది అవార్డ్స్ ఇస్తారు. ఆ సమయంలో ఒకే స్టేజి మీద జగన్, బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు లను చూసే అరుదైన అవకాశం రానుంది. వైసీపీ పార్టీ అధినేత జగన్, బాలకృష్ణ, ఎన్టీఆర్ తెలుగుదేశం వారసులు… మాములుగా అయితే ఈ ముగ్గురిని ఒకే వేదికపై చూడడం అనేది కలలో కూడా సాధ్యపడదు. కానీ ఇలా నంది అవార్డుల పుణ్యమా అని జగన్, బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబులను ఒకే వేదికపై చూడటం విశేషమే. ఇక ఈ దృశ్యం అభిమానులకు కనువిందు కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related posts