కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ పరీక్షల్లో మరోసారి అపశ్రుతి చోటుచేసుకుంది.
పరీక్షల్లో భాగంగా ఇటీవల ఓ వలంటీర్ అస్వస్థతకు గురికాగా, మూడోదశ పరీక్షల్లోనూ అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురష్కో స్వయంగా వెల్లడించారు.
వ్యాక్సిన్‌కు జరుగుతున్న తుది పరీక్షల్లో భాగంగా మొత్తం 40 వేల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.ఇప్పటి వరకు 300 మందికి టీకా వేసినట్టు చెప్పారు.
టీకా తీసుకున్న ప్రతి ఏడుగురు వలంటీర్లలో ఒకరిలో కండరాల నొప్పి, జ్వరం, నీరసం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. 36 గంటల తర్వాత ఈ లక్షణాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని మంత్రి వివరించారు.
రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై భారతీరాజా కామెంట్స్