telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఆరే కాల‌నీలో చెట్లను న‌రికివేయ‌రాదు: సుప్రీం ఆదేశం

trees cutting bombay

ముంబై మహానగరంలోని ఆరే కాల‌నీలో చెట్లను నరకడం పై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది. అనుకున్న సంఖ్య క‌న్నా ఎక్కువ వృక్షాల‌ను న‌రికివేయ‌రాదు అని కోర్టు ఆదేశించింది. అరెస్టు చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను విడుద‌ల చేయాల‌ని సుప్రీం కోర్టు పేర్కొన్న‌ది. సోలిస‌ట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా మ‌హారాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌ర‌పున వాద‌నలు వినిపించారు. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ ఈనెల 21న ఉంటుంద‌ని కోర్టు తెలిపింది. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ కూడా ఈ కేసులో ఓ పార్టీగా ఉండేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుప్రీం సూచించింది. ఇక నుంచి చెట్ల‌ను కూల్చ‌మ‌ని తుషార్ మెహ‌తా కోర్టుకు స్ప‌ష్టం చేశారు.

Related posts