telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విక్టరీ వెంకీ సపోర్ట్ తీసుకుంటోన్న మాస్‌ రాజా.!

విక్టరీ వెంకటేశ్ వాయిస్ లో ఓ పెక్యులారిటీ ఉంటుంది. దాంతో ఆయన వాయిస్ ఓవర్ ఇస్తే… తమ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని భావించే దర్శక నిర్మాతలు కొందరున్నారు. గతంలో హాలీవుడ్ సినిమా ‘అల్లాద్దీన్’కు వెంకటేశ్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ మూవీకి వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వెంకటేశ్ నటించిన ‘బాడీగార్డ్’ మూవీని మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేశాడు. ఆ అనుబంధంతోనే ‘క్రాక్’కు వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… త్వరలో విడుదల కాబోతున్న మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ చిత్రానికీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇస్తుండటం విశేషం.

Related posts