telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

“నారాయణ అండ్ కో” సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో !!!

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీతో టాలీవుడ్‌ కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల. తాజాగా సుధాకర్ నటింటిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. ఈ మూవీ జూన్ 30వ తేదీన థియేటర్లోకి వచ్చి మంచి స్పందనతో అలరించింది. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా పతాకాలపై పాపిశెట్టి బ్రదర్స్‌ సహకారంతో సుధాకర్‌ ఈ మూవీని నిర్మించారు. శ్రీనివాస్ గొర్రిపూడి ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. చిన పాపిశెట్టి ఈసినిమాకు దర్శకత్వం వహించారు.

నారాయణ అండ్ కో… ‘ది తిక్కల్ ఫ్యామిలీ’ ట్యాగ్ లైన్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ చుట్టూ తిరిగే కథతో ఫన్‌ ఎలిమెంట్స్‌ తో ఈ సినిమా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాన్ని లీడ్‌ చేసే యజమాని నారాయణ పాత్రలో దేవీ ప్రసాద్ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించాడు. అతని భార్య పాత్రలో సీనియర్ నటి ఆమని నటించగా… కొడుకు పాత్రలో సుధాకర్ నటించి మెప్పించాడు.

థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు నారాయణ అండ్ కో సినిమాను అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చు.

Related posts