telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్షంతో తడిసిన ఆస్కార్ వేదిక… వర్షపు నీటిని ఆపడానికి నానా తిప్పలు

Oscars

2019 సంవత్సరానికిగాను 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. సినిమా ప్రంపంచంలో అత్యుత్తమ అవార్డులైన ఆస్కార్ పండుగ ముగిసింది. మహామహులంతా హాజరైన ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ 92వ ఆస్కార్ పండుగలో వర్షం పెద్ద తలనొప్పే తెచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల సెలెబ్రిటీల కోసం పరచిన రెడ్‌కార్పెట్‌ తడిచి ముద్దయిపోయింది. దీంతో నిర్వాహకులు కంగారు పడిపోయారు. హడావుడిగా వచ్చి రెడ్‌కార్పెట్‌ను ఆరబెట్టడానికి, సీలింగ్ నుంచి కారే వర్షపు నీటిని ఆపడానికి నానాతిప్పలూ పడ్డారు. కానీ వారి ప్రయత్నాలు పెద్దగా ఫలితాలివ్వలేదు. దీంతో సీలింగ్‌ నుంచి కారుతున్న నీటి చుక్కలు పడే ప్రాంతంలో ఓ బకెట్ పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Related posts