telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

జైలు శిక్ష కూడా .. ఒక శిక్షేనా.. కూర్చోపెట్టి మేపటం శిక్ష అవుతుందా.. !భారత శిక్షాస్మృతి మారదా..!

ARREST crime

నిన్న నిర్భయ కేసు కొలిక్కి రాలేదు, అంతలోనే దిశా కేసు విచారణలో ఉంది. ఇలాంటివి ఎన్నో ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అవన్నీ నిన్న అనే చరిత్రలో(ఉన్నావ్ కేసు కూడా) కలిసిపోయాయా.. కావలసిన వారని కలిపేస్తున్నారా.. ఏది నిజమో పౌరులే తెలుసుకోవాలి. అప్పుడే ఆ నిజానిజాలు నిగ్గు తేలుతాయి. అధికారం, డబ్బు ఉన్న వారు ఉన్నత న్యాయ స్థానాల నుండి కూడా సురక్షితంగా బయటకు వస్తారని ఎన్నో కేసులు ఇప్పటికే నిరూపించాయి కూడా. మరి ఈ అఘాయిత్యాలపై మాత్రం స్పష్టమైన న్యాయం ఎక్కడి నుండి వస్తుందనో ఈ వెర్రి జనాల నిరసనలు. వాళ్ళు నిరసనలు చేస్తున్నారని కొంతకాలం ఈ కేసులను పట్టించుకున్నట్టు ప్రభుత్వాలు-కోర్టులు సీన్ చేస్తారు.. మళ్ళీ మాములే. కాదుకూడదు అనుకుంటే, కఠిన కారాగార శిక్ష అంటూ ఉంటుంది. దానిని వేసి, ఏమి చేస్తున్నారు.. మృగాలను మూడుపూటలా తిండిపెట్టి మేపుతున్నారు. ఇదే భారత శిక్షాస్మృతి అయితే, నేరం చేయడానికి కూడా భయపడే విధంగా మృగాలు వెనకడుగు వేస్తాయా.. లేక చక్కగా నేరం చేసి, పలుకుబడి- బట్టి; ఈ రెండు కూడా లేకుంటే జైలులో కఠిన కారాగార శిక్ష పేరుమీద ఎంచక్కా మూడుపూటలా తిని, బెయిల్ తో లేదా సత్ప్రవర్తన పేరుమీద మళ్ళీ బయటకు వచ్చి, అదే నేరం చేస్తారు. ఇలాంటివి భారత చరిత్రలో ఎన్నో.. అయినా ఈ శిక్షాస్మృతిని మార్చరు ఎందుకో.. బహుశా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా అలాంటి నేరాలకు పాల్పడితే.. అనే ఆలోచన వారిని ఈ తరహా ముందడుగు వేయనీయదు.

మరి కోర్టులు మాత్రం స్వేచ్ఛగా వారి తీర్పును వెలువరిస్తున్నాయని సగటు భారతీయుడికి నమ్మకం ఎప్పుడో పోయింది. అయినా ఎక్కడో చిన్న ఆశ, ఆ కోర్టులలో న్యాయం జరుగుతుందని… జరిగే మాట అది డబ్బున్నోడికో, అధికారం ఉన్నోడికో మాత్రమే. ఇది బహిరంగ రహస్యం. తాజాగా ఒక కుటుంబ పెద్ద శిక్ష వేసింది కోర్టు. ఏమైఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. 20ఏళ్ళ కఠిన కారాగార శిక్షతో పాటుగా 500 రూపాయల జరిమానా విధించింది. ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ తీర్పు. అసలు ఆ ఇంటికి పెద్దగా ఉన్న వాడికి శిక్ష విధించి, జైలులో పెట్టి ముప్పొద్దులా తిండి పెడుతున్నారు సరే, మరి ఆ మిగిలిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి.. ఈ చిన్న ఆలోచన కోర్టులో తీర్పు చెప్పేవాళ్లకు రాదా..! అలా వచ్చి ఉంటె, అతడికి శిక్ష వేయాలి, విపరీతంగా జైలులో పని చేయించి, ఆ జీతాన్ని ఆ కుటుంబ పోషణకు పంపించాలి. ఇలాంటి శిక్షలు వేసినప్పుడు ఆయా కుటుంబాలు రోడ్డున పడకుండా లేదా తప్పుడు దారులు తొక్కకుండా వారికి జీవనోపాధి కల్పించాలి. ఇవన్నీ శిక్ష వేసే వ్యక్తి లేదా వ్యవస్థ ఆలోచించాలి. ఎందుకంటే, ఆ నేరస్తుడు తప్పు చేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాడు సరే, మరి ఆ కుటుంబానికి శిక్ష ఎందుకు! ఇకమీదట శిక్షలు వేసేప్పుడు పాత చట్టాలను పరిగణలోకి తీసుకోకుండా, మారుతున్నా పరిస్థితులను బట్టి శిక్షాస్మృతిలో కూడా(రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని ఎంతో మార్చేశారు) మార్పులు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ.. ఆ కేసు వివరాలు :

ఇబ్రహీంపట్నం లో నివాసముంటున్న సైకం కృష్ణారావు అనే వ్యక్తి ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అతనితో పాటుగా అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు బిడ్డల తల్లిపై మనసు పడ్డాడు. ఈ క్రమంలో తనకు భార్యలేదని.. ఒప్పుకుంటే పెళ్లిచేసుకొంటానని ఆమెకు ప్రపోజ్‌ చేయడమే కాకుండా తన పిల్లలని కన్నబిడ్డల్లా చూసుకుంటానని బాస చేశాడు. అప్పటికే తన భర్తతో తెగతెంపులు చేసుకొని పిల్లలతో ఇబ్బంది పడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న ఆ వివాహిత కృష్ణారావు ప్రతిపాదనకు ఒప్పుకుంది. ఈ క్రమంలో పదకొండేళ్ళుగా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. ఇక అప్పటికే మొదటి భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా వారితో పాటుగానే ఉండేవారు. వారిలో పదో తరగతి చదువుతున్న కూతురిపైనే కన్నేశాడు ఈ మారు తండ్రి కృష్ణారావు.

అతని భార్య బైటికెళ్లిన సమయంలో వరసకు కూతురన్న కనికరం కూడా లేకుండా మాటేసి కాటేశాడు. పశువులా మారి కామవాంఛ తీర్చుకొన్నాడు. వావివరసలు మరిచి శునకానందం పొందాడు. ఇంటికొచ్చిన తల్లికి జరిగిన ఘోరం చెప్పగా., భరించరాని కోపంతో ఆ నీచునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పింది. ఇక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేయడంతో ఏడాది తిరక్కముందే కేసు విచారణకు రాగా. విజయవాడలోని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కేసును విచారించి కృష్ణారావును దోషిగా తేల్చి అతనికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువందల జరిమానా విధించారు. దిశ లాంటి కేసుల విషయంలో కూడా శిక్ష కఠినంగా ఉండాలి, తద్వారా మళ్ళీ ఎవరికి అలాంటి నేరం చేయాలనే ఆలోచన కూడా రాకూడదు.

Related posts