telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ అమరావతిని నా వారసత్వంగా చూస్తున్నాడు: చంద్రబాబు

chandrababu

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ఆలోచన విఫలమైందని అన్నారు. అమరావతిని నా వారసత్వంగా జగన్ చూస్తున్నాడని దుయ్యబట్టారు. అందుకే, రాయలసీమ, ఆంధ్ర ప్రజల ప్రయోజనాలను వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాడని విమర్శించారు.

రాజధాని అమరావతి ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని నాశనం చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నాడని విమర్శిస్తూ ఓ పోస్ట్ లో చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Related posts