telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : ఆతిధ్య దేశం.. జట్టు ఖరారు..

2019 odi world cup england team

నేడు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే తమ జట్టును ప్రకటించింది. 15మంది సభ్యులు గల జట్టులో అంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డేలా యువ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించారు. ఆర్చర్‌తో పాటు జేమ్స్‌ విన్స్‌, లియామ్‌ డాసన్‌కు చోటు దక్కగా.. డేవిడ్‌ విల్లే, అలెక్స్‌ హేల్స్‌, జోయ్‌ డెన్లీలకు ఉద్వాసన పలికారు. నిలకడైన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లోనూ సత్తాచాటే ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని వేదికల్లో, సిరీస్‌ల్లో సత్తాచాటిన వారే కావడం ఆ టీమ్‌కు కలిసొచ్చే అంశం.

సొంతగడ్డపై పరిస్థితులను సద్వినియోగం చేసుకొని గొప్ప ప్రదర్శన చేస్తే ఈసారి కప్పు ఇంగ్లాండే. ఇంగ్లాండ్‌ జట్టు: ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో(వికెట్‌ కీపర్‌), జేమ్స్‌ విన్స్‌, జో రూట్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌(వికెట్‌ కీపర్‌), మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌, లియామ్‌ డాసన్‌, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ఫ్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, టామ్‌ కర్రన్‌

Related posts